ఏపీ ప్రభుత్వంపై టాలీవుడ్ యంగ్ హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎం జగన్‌ను చెడ్డగా చూపే కుట్ర జరుగుతోందని ఆయన వరుస ట్వీట్‌లు చేసుకుంటూ వచ్చారు. జగన్‌ను తప్పుగా చూపించేందుకు కొందరు ఆయనకు తెలియకుండానే.. ఆయన కొన్ని పనులు చేస్తున్నారని.. ఈ పనుల వల్ల ఆయన్ రెప్యుటేషన్కి… ఆయన మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోందని.. మీరు వాళ్లపై ఓ లుక్కేయాలని ట్వీట్ చేశాడు. రామ్ ట్వీట్ చేయడానికి ప్రధాన కారణం ఇటీవల విజయవాడలోని రమేష్ హాస్పటల్‌కు అనుబంధంగా ఉన్న స్వర్ణప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది వరకు చనిపోయిన సంగతి తెలిసిందే. డాక్టర్ రమేష్ రామ్‌కు పెదనాన్న అట.
స్వర్ణ ప్యాలస్ ఘటన అగ్ని ప్రమాదం నుంచి ఫీజు వైపు మళ్లించారని.. ఈ విధంగా మార్పు చేసి అందర్నీ ఫుల్ చేస్తున్నారని…. ఫైర్ + ఫీజు = ఫూల్స్ అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రమేష్ హాస్పటల్ వాళ్లు స్వర్ణప్యాలెస్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చకముందే అక్కడ ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నిర్వహించిందని… అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ? అని ఆయన ప్రశ్నించాడు. రామ్ ఈ విషయంపై వరుసగా చేసిన ట్వీట్లు అన్నింటికి ఆయన #APisWatching అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ చర్చనీయాంశంగా మారాయి.