మెగా హీరోపై అల్లు డామినేష‌న్‌… ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌..!

టాలీవుడ్ యంగ్ హీరోలు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మ‌ధ్య కొద్ది రోజులుగా వృత్తిప‌ర‌మైన ప్ర‌చ్ఛ‌న్న‌య‌ద్ధం కాస్తా ముదురుతోంద‌న్న గుస‌గుస‌లు అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక వివాహానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌పోయినా ఇటు చిరు బావ‌మ‌రిది అల్లు కుటుంబం మొత్తం హాజ‌రైంది. ఈ ఎంగేజ్మెంట్ ఫంక్ష‌న్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఆయ‌న భార్య స్నేహారెడ్డే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. బ‌న్నీ హెయిర్ స్టైల్ డిఫ‌రెంట్‌గా ఉండ‌డంతో పాటు బ్లాక్ డ్రెస్సులో అద‌ర‌గొట్టాడు.

 

అక్క‌డ అంద‌రి క‌ళ్ల‌తో పాటు కెమేరాలు అన్నీ బ‌న్నీ దంప‌తుల మీదే ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే బ‌న్నీ దంప‌తులు చ‌ర‌ణ్ దంప‌తుల‌ను పూర్తిగా డామినేట్ చేశార‌నే చెప్పాలి. ఇక ఈ నిశ్చితార్థం ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాక చ‌ర్చ అంతా బ‌న్నీ ఫ్యామిలీ గురించే.. బ‌న్నీ ఫ్యామిలీ ఫొటోలు ఓ రేంజ్‌లో హైలెట్ అవుతున్నాయి. మ‌రోవైపు రామ్‌చ‌ర‌ణ్ ఆయ‌న భార్య ఉపాస‌న ఎలాంటి హ‌డావిడి లేకుండా సింపుల్‌గా వ‌చ్చారు. ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఫోటోలు సోష‌ల్ మీడియాలో చూస్తుంటే బ‌న్నీ, స్నేహారెడ్డి ఫొటోలే ఎక్క‌డ చూసినా క‌నిపిస్తున్నాయి.

 

సోష‌ల్ మీడియాలో కూడా ప‌లువురుస సూప‌ర్ క‌పుల్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సోషల్ మీడియా టీమ్ ఈ ఫొటోల్ని మరింత బాగా షేర్ చేయడంతో.. నిహారిక ఫంక్షన్ అని సెర్చ్ చేస్తే స్టైలిష్ స్టార్ స్టైలిష్ జోడీ ఫొటోలే కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. సో ఓవ‌రాల్‌గా ఈ ఫంక్ష‌న్‌నే బ‌న్నీ – స్నేహ దంప‌తులు హైలెట్ అయ్యారు.

Leave a comment