షాక్‌: క్వారంటైన్‌లోకి మ‌హేష్‌బాబు టీం..

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం సినిమా షూటింగ్‌లు అన్నీ వాయిదా ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని పెద్ద సినిమాలు సెట్స్ మీద‌కు వెళ్లాలంటే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – ప‌ర‌శురాం కాంబోలో వ‌స్తోన్న స‌ర్కారు వారి పాట సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లేందుకు రెడీగా ఉంది. పొలిటిక‌ల్ నేప‌థ్యం ఉన్న లైన్‌తో సినిమా ఉంటుంద‌ని.. ఈ సినిమాలో మ‌హేష్‌బాబు ఒక మంత్రి కొడుకుగా న‌టిస్తాడ‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

 

ముందుగా క‌థానుసారంగా ఈ సినిమా షూటింగ్‌ను తెలంగాణ‌లోని కొన్ని ప‌ల్లెల్లో షూట్ చేస్తార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ షూటింగ్‌లో పాల్గోనే వారంద‌రిని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం 14 రోజుల పాట క్వారంటైన్‌లో ఉంచిన త‌ర్వాత షూట్ స్టార్ట్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. కేవ‌లం సినిమా యూనిట్‌తో పాటు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా క్వారంటైన్‌లోకి వెళ్లార‌ని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ విష‌యంలో మ‌హేష్‌బాబు కూడా సీరియ‌స్‌గానే ఉన్నాడ‌ట‌. సినిమాను స్పీడ్‌గా షూట్ చేసి వ‌చ్చే యేడాది ద‌స‌రా లేదా దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Leave a comment