కేజీఎఫ్ సినిమాతో యశ్ పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుంటే, బాహుబలి 1,2 – సాహో సినిమాలతో యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తిరుగులేని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ రెండు సినిమాల్లో కలెక్షన్ల పరంగా చూస్తే ప్రభాస్ బాహుబలి టాప్‌లో ఉంది. ఇక కేజీఎఫ్ కూడా కన్నడ భాషలో తెరకెక్కినా మిగిలిన అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 కోసం యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోంది.
ప్రభాస్ ఇప్పుడు తాను చేస్తోన్న ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కస్తున్నారు. ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలతో తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్, మార్కెట్ కంటిన్యూ చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇక యశ్ సైతం కేజీఎఫ్‌తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ నిలబెట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగులో కూడా యశ్ పుట్టిన రోజుకు బ్యానర్లు వెలిశాయంటేనే యశ్ క్రేజ్ తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు ఇటు సౌత్‌లోనూ… అటు నార్త్‌లోనూ ప్రభాస్, యశ్‌లలో ఎవరి సత్తా ఎంత ? ఎవరి మార్కెట్ ఏంటి ? ఎవరు నిజమైన పాన్ ఇండియా స్టార్ ? ఎవరి మార్కెట్ ఎక్కువ అంటూ రకరకాల పోలికలు వస్తున్నాయి. అయితే ఇప్పటకి ప్రభాస్ మార్కెట్ ఎక్కువన్నది కనపడుతున్నా.. కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యి .. సాధించే విజయాన్ని బట్టి వీరిలో ఎవరి స్టామినా ? ఏంటి ? ఇద్దరు పాన్ ఇండియా స్టార్లుగా నిలబడతారా ? ఈ రేసులో ఎవరు ముందుంటారు ? ఎవరు వెనకపడతారు ? అన్నది తేలిపోనుంది.