ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయంలో ఉద్యోగులు లైంగీక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల మధ్య ప్రేమ కలాపాలు, లైంగీక వేధింపుల వార్తలను మనం చూశాం… కొద్ది రోజుల క్రితమే ఓ మహిళా వలంటీర్‌కు గ్రామ సచివాలయ ఉద్యోగి లవ్ లెటర్ రాసిన వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఇదే తరహాలో మరో వార్తల వెలుగులోకి వచ్చింది.
ఓ మహిళా వలెంటీర్ ను సచివాలయ ఉద్యోగి వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని గోరంట్లలో ఓ మహిళా వలెంటీర్‌ను ఓ సచివాలయ ఉద్యోగి వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఆరోపించింది. ధృవీకరణ పత్రం ఆలస్యంపై ప్రశ్నించిన వలెంటీర్ ను సచివాలయ ఉద్యోగి, తోటి వలెంటీర్ అసభ్యంగా దూషించారని బాధితురాలు ఆరోపిస్తోంది.
అలాగే సదరు మహిళా వలంటీర్ భర్త కూడా ప్రశ్నించడంతో అతడిపై కూడా సచివాలయ సిబ్బంది దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ ఘటనపై దిశా స్టేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. దిశా స్టేషన్ ఎదుటే బాధిత మహిళా వాలెంటీర్ కన్నీరు పెట్టుకుంది. ఏదేమైనా జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇలా లైంగీక వేధింపుల కేసుల్లో చిక్కుకోవడం మైనస్‌గా మారింది.