టాలీవుడ్ యంగ్ హీరోకు క‌రోనా… కొంప‌ముంచింది వీళ్లేనా..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ క‌రోనా మ‌న దేశంలోనూ స్వైర‌విహారం చేస్తోంది. ఈ క‌రోనా ఏ రంగాన్ని వ‌ద‌ల‌డం లేదు. టాలీవుడ్‌లో ఇప్ప‌టికే ప‌లువురికి క‌రోనా సోకింది. ఈ లిస్టులోకి ఇప్పుడు ఓ యంగ్ హీరో కూడా చేరిపోయాడ‌ని అంటున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి దంప‌తుల‌కు క‌రోనా సోకింది. ఆ త‌ర్వాత మ‌రో డైరెక్ట‌ర్ తేజ‌కు కూడా క‌రోనా సోక‌గా.. ఇక నిర్మాత బండ్ల గ‌ణేష్‌, ప్ర‌ముఖ సింగ‌ర్ ఎస్పీ, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, మ‌రో పాప్ సింగ‌ర్ స్మిత‌కు క‌రోనా సోకింది.

 

ఈ క్ర‌మంలోనే ఓ టాలీవుడ్ యంగ్ హీరో సైతం కోవిడ్-19 భారీన ప‌డ్డార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల వ‌రుస హిట్లు కొడుతూ మంచి ఫామ్‌లో ఉన్న స‌ద‌రు యువ హీరో కొద్ది రోజుల క్రితం త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఓ పార్టీకి హాజ‌ర‌య్యాడ‌ట‌. ఆ త‌ర్వాత జ్వ‌రం రావ‌డంతో కొద్ది రోజులుగా హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్ అని తేలింద‌ట‌. కొద్ది రోజులు విశ్రాంతి త‌ర్వాత నెగిటివ్ వ‌చ్చాక కాని అత‌డు ఈ విష‌యాన్ని త‌న స‌న్నిహితుల‌కు చెప్ప‌లేద‌ట‌. స‌ద‌రు యువ హీరోకు ఆ రోజు పార్టీకి వెళ్ల‌డం వ‌ల్లే కోవిడ్ ఎటాక్ అయ్యింద‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు రావ‌డంతో ఇప్పుడు ఆ పార్టీకి వెళ్లిన వారు కూడా ఆందోళ‌న‌లో ఉన్నార‌ట‌.

Leave a comment