అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా మోదీ అయోధ్య రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. భారతదేశ వ్యాప్తంగానే ఉన్న హిందువులే కాకుండా.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ సోషల్ మీడియా వేదికగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ భూమిపూజపై పాకిస్తాన్ క్రికెటర్ డానేష్ కనేరియా సోషల్ మీడియాలో స్పందించారు.
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో డిస్ ప్లే చేసిన రామమందిరం ఫొటోను షేర్ చేసి దానికి జై శ్రీరామ్ క్యాప్షన్ జోడించాడు. శ్రీరాముడి అందం ఆయన పేరులో మాత్రమే కాకుండా వ్యక్తిత్వంలో కూడా దాగి ఉందని కనేరియా చెప్పాడు. శ్రీరాముడు మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నాడు. ఇక పాక్ జట్టులో ఆడిన రెండో క్రికెటర్ కనేరియా. అంతకుముందు అనిల్ దలపత్ అనే హిందూ బౌలర్ 1980 ప్రాంతంలో పాక్ జట్టులో ఆడాడు. అతడు కనేరియాకు బంధువు అవుతాడు.
ఇక గతంలో కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాడన్న ఆరోపణల నేపథ్యంలో పాక్ బోర్డు కనేరియాపై జీవిత కాల నిషేధం విధించింది. అయితే నిషేధం ఎత్తివేయాలని పాక్ బోర్డును కోరినా పట్టించుకోవడం లేదని అతడు వాపోయాడు. తాను ఒక హిందువు అయినందునే పీసీబీలో మద్దతు దొరకడం లేదని చెప్పాడు. పాక్ ఆటగాళ్లపై నిషేధం తగ్గిస్తున్నా తన విషయంలో మాత్రం పీసీబీ పట్టించుకోవడం లేదన్నాడు.