ఆ డైరెక్ట‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ ఫిక్స్‌.. ఫ్యాన్స్‌లో ఒక్క‌టే టెన్ష‌న్‌…!

ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యాన‌ర్ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఎంతో మంది స్టార్ హీరోల‌తో పాటు స్టార్ ద‌ర్శ‌కుల కాంబినేష‌న్లో సినిమాలు ఫిక్స్ చేసుకుంటూ ముందుకు వెళుతోంది. మైత్రీ మూవీస్ నుంచి సినిమా వ‌స్తుందంటే టాప్ హీరో.. టాప్ డైరెక్ట‌ర్‌.. అది ఓ ప్రెస్టేజియ‌స్ సినిమా అన్న అంచ‌నాలు ఇండ‌స్ట్రీ జ‌నాల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సంస్థ ఓ స్టార్ హీరోతో కోలీవుడ్ డైరెక్ట‌ర్‌తో ఓ కాంబినేష‌న్‌ను సెట్ చేసింద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

 

ఇప్ప‌టికే మైత్రీ మూవీస్ కె.జి.యఫ్ దర్శకుడితో ఎన్టీఆర్ చిత్రాన్ని లాక్ చేసింద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ సినిమా కోసం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌ను లాక్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కార్తీతో ఖైదీ లాంటి హిట్ కొట్టిన లోకేష్ ప్ర‌స్తుతం విజ‌య్‌తో మాస్ట‌ర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మైత్రీ మూవీస్ బ్యాన‌ర్లో రామ్ చ‌ర‌ణ్ నటించే సినిమా కోసం లోకేష్ క‌న‌గ‌రాజ్ ను ఫైన‌ల్ చేశాడ‌నే ఇండ‌స్ట్రీ టాక్‌..?

 

అయితే ఇదే మెగా అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. గ‌తంలో కూడా బ‌న్నీ లింగుస్వామితో తెలుగు, త‌మిళ్ సినిమా ప్లాన్ చేసి త‌ప్పుకున్నాడు. ఇత‌ర భాష‌ల ద‌ర్శ‌కుల‌తో సినిమాలు వాళ్ల‌కు క‌లిసి రావ‌డం లేదు. గ‌తంలో చెర్రీ అపూర్వ ల‌ఖియాతో జంజీర్ చేయ‌గా అది ప్లాప్ అయ్యింది. ఇప్పుడు లోకేష్‌తో సినిమా అంటే అది నేటివిటి ప‌రంగా సెట్ కాదేమో అని మెగా అభిమానులు ఆందోళ‌న‌లో ఉన్నారు. మ‌రి చెర్రీ ఎలాంటి డెసిష‌న్ ఉంటుందో ? చూడాలి.

Leave a comment