జ‌గ‌న్ నాకు త‌మ్ముడే… అయినా సిగ్గుప‌డుతున్నాఅంటూ పృథ్వి సంచ‌ల‌నం

30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వి సినిమా రంగం నుంచి ముందు డేరింగ్‌గా వైఎస్సార్‌సీపీకి మ‌ద్ద‌తు ప‌లికారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పాల్గొన‌డంతో పాటు వైసీపీకి ఎన్నిక‌ల ముందు అనేక విధాలుగా ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే ఆయ‌న‌కు ఎస్వీబీసీ ఛానెల్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. అయితే ఆ ప‌ద‌వి చేప‌ట్టిన కొద్ది రోజులుగా ఓ లేడీ కాల్ ఉదంతంతో ఆయ‌న ఆ ప‌ద‌వి పోగొట్టుకున్నారు. తాజాగా పృథ్వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్‌తో త‌న‌కు 2004 నుంచి అనుబంధం ఉంద‌ని చెప్పిన పృథ్వి నాలుగేళ్లుగా పార్టీ కోసం ప‌నిచేశాన‌ని.. ఆయ‌న‌తో పాద‌యాత్ర చేయ‌డం ద్వారా మంచి అనుబంధం ఏర్ప‌డింద‌ని చెప్పారు.

 

ఆయ‌న న‌న్ను కొట్టి మాట్లాడ‌తార‌ని.. పృథ్వి అన్న అదీ ఇదీ అని అప్యాయంగా మాట్లాడార‌ని చెప్పిన పృథ్దీ త‌న‌ను సొంత కుటుంబ స‌భ్యుడిలాగానే చూస్తార‌ని చెప్పారు. ఇక జ‌గ‌న్‌ను చూసి తాము చాలా నేర్చుకున్నామ‌ని… అయితే ఆయ‌న లాగా లేనందుకు తాము సిగ్గుప‌డ‌తామ‌ని పృథ్వి తెలిపారు. జ‌గ‌న్ నా కంటే చిన్న‌వాడు అయినందున నాకు త‌మ్ముడు అవుతాడ‌న్న పృథ్వీ… ఆయ‌న‌ను చూసి తాము చాలా అల‌వాట్లు వ‌దిలేశామ‌ని… ఇందో ప‌ది శాతం ఉన్నాయ‌ని.. అయితే సినిమా రంగంలో ఉండ‌డంతో అవి వ‌ద‌ల‌డం క‌ష్టంగా ఉంద‌న్నారు.

 

సినిమా రంగంలో పార్టీలు చాలా కామ‌న్ అని.. అప్పుడ‌ప్పుడు ఓ పెగ్ కూడా వేస్తామ‌ని పృథ్వీ తెలిపాడు. ఇక పెగ్ అల‌వాటు కూడా మానేస్తే సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధం అమ‌ల‌వుతుంద‌ని తెలిపాడు.

Leave a comment