బ్రేకింగ్‌: మ‌ళ్లీ వార్త‌ల్లోకి సాధినేని యామిని

టీడీపీలో ఉన్న‌ప్పుడు ప‌లు కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ల‌తో వార్త‌ల్లోకి ఎక్కిన సాధినేని యామాని.. ఇప్పుడు బీజేపీలో ఉన్నా కూడా అంతే కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు… చ‌ర్చ‌ల్లో వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో ఉంటున్నారు. తాజాగా ఆమెపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై యామిని చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

ఈ కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు. ఏదేమైనా 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న ఆమె ఇప్పుడు బీజేపీలోనూ త‌న వ్యాఖ్య‌ల‌తో సంచ‌ల‌నంగా మారింది.

Leave a comment