ప‌వ‌న్‌పై మెగా గుస్సా… మంట మొద‌లైంది…!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె, హీరోయిన్ నిహారిక ఎంగేజ్మెంట్ వైభ‌వంగా జ‌రిగింది. ఈ ఎంగేజ్మెంట్‌కు ఇటు మెగా, అల్లు కుటుంబాల‌కు చెందిన వారితో పాటు అటు పెళ్లి కుమారుడు త‌ర‌పు ముఖ్య బంధువులు అంద‌రూ హాజ‌ర‌య్యారు. మెగా ఫ్యామిలీ నంఉచి హీరోలుగా ఉన్న రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌, ఉపాసన ఇలా అంద‌రూ వ‌చ్చి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. అయితే ఈ ఫంక్ష‌న్లో నిహారిక బాబాయ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేని లోటు స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది.

 

ప‌వ‌న్ అభిమానుల్లో కొంద‌రు ప‌వ‌న్ చాతుర్మాస దీక్ష‌లో ఉండ‌డంతో వెళ్ల‌లేద‌ని స‌ర్ది చెప్పుకుంటున్నా.. మ‌రి కొంద‌రు మాత్రం ప‌వ‌న్ వెళ్ల‌క‌పోతే భార్య‌, పిల్ల‌ల‌ను ఎందుకు పంప‌లేద‌న్న ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఆన్స‌ర్ చెప్ప‌లేక‌పోతున్నారు. ప‌వ‌న్ ఎంత దీక్ష‌లో ఉన్నా కూడా త‌న అభిమాని అయిన హీరో నితిన్‌ ను పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా దీక్షలో ఉండగానే ఇంటికి వెళ్లి మరీ ఆశీర్వదించి వచ్చాడు. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రూ వెళ్లి మ‌రీ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యారు.

 

మ‌రి ఇప్పుడు సొంత అన్న‌కుమార్తె నిహారిక ఎంగేజ్మెంట్‌కు వెళ్ల‌క‌పోవడంతో మెగా అభిమానులు కూడా ప‌వ‌న్ పై గుస్సాతో ఉన్నారు. ప‌వ‌న్ ప‌దే ప‌దే ఇలా చేయ‌డం వ‌ల్ల ఎందుకు లేనిపోని అపోహ‌ల‌కు తావిస్తార‌ని కూడా వారి నుంచే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. నాగ‌బాబు ఎప్పుడూ ప‌వ‌న్‌కు అండ‌గా ఉంటాడు. పవన్ ని ఒక్క మాట కూడా పడనియ్యడు. అంత ఎందుకు జనసేన పార్టీలో చేరి న‌ర‌సాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఏదేమైనా ప‌వ‌న్‌పై మెగా అభిమానుల్లో కొంద‌రిలో అస‌హ‌నం, మంట మొద‌లైంద‌న్న‌ది మాత్రం ఆ కౌంపౌండ్ వ‌ర్గాల్లోనే వినిపిస్తోన్న గుస‌గుస‌.

Leave a comment