అజ్ఞాతవాసి ప్లాప్ తర్వాత ఫుల్ టైం పొలిటిషీయన్ అవుతానన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేశారు. ఆయన తన అభిమానుల ఆకలి తీర్చేసేలా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్‌గా వస్తోన్న వకీల్‌సాబ్ సినిమాలో నటిస్తోన్న పవన్ ఆ వెంటనే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ సినిమాలో నటిస్తున్నారు. ఇది కాకుండా హరీశ్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్‌సింగ్ 2కు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికే వకీల్‌సాబ్ రిలీజ్ కావడంతో పాటు క్రిష్ సినిమా కూడా చాలా వరకు షూటింగ్ ఫినిష్ అయ్యి ఉండేది.
ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉంటోన్న పవన్ వరుసగా కథలు వింటూ ఓకే చేసుకుని వెళుతున్నాడు. పైన చెప్పుకున్న మూడు సినిమాలతో పాటు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారట. బేసిక్‌గా రైటర్ అయిన వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది. ఆ తర్వాత వీరు వేరువేరు అయ్యారు. వంశీ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో మెగాఫోన్ పట్టినా ఆ సినిమా ప్లాప్ అయ్యింది.
ఆ తర్వాత వంశీ ఫామ్‌లో లేడు. ఇప్పుడు మరోసారి వంశీ కథతో సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో పవన్ సినిమా అనగానే పవన్ ఫ్యాన్స్‌లో ఎక్కడో ఆందోళన మోదలైంది. ఇటు సురేందర్‌రెడ్డి ధృవ రీమేక్ సినిమాతో మెప్పించినా మెగాస్టార్‌ను సైరాతో సరిగా డీల్ చేయలేకపోయాడు. ఇప్పుడు పవన్ అభిమానుల్లో పవన్‌ను వక్కంతం వంశీ, సురేందర్‌రెడ్డి సరిగా హ్యాండిల్ చేస్తారా ? అన్న సందేహాలు అయితే అందరికి ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ ఊసరవెల్లి, ఆశోక్, మహేష్ అతిథితో ఛాన్సులు ఇచ్చిన వీరు సరిగా ఉపయోగించుకోలేకపోయారు.