Gossipsఆ హాట్ హీరోయిన్‌తో ప్ర‌భాస్ రొమాన్స్‌కు రెడీనా... ఏం ల‌క్కీ ఛాన్స్...

ఆ హాట్ హీరోయిన్‌తో ప్ర‌భాస్ రొమాన్స్‌కు రెడీనా… ఏం ల‌క్కీ ఛాన్స్ కొట్టిందిలే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న సినిమాలు అన్నీ భారీ అంచ‌నాల్లోనే ఉన్నాయి. వీటిల్లో అన్నింటిక‌న్నా ఎక్కువ అంచ‌నాల‌తో ఉన్న సినిమా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ప్ర‌భాస్ 21వ ప్రాజెక్టు. మ‌హానటితో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిన నాగ్ అశ్విన్ ఆ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ వ‌ర్క్ చేసి తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు ఇది సైన్ష్ ఫిక్ష‌న్ ప్రాజెక్టుగా తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో మంచి అంచ‌నాలు ఉన్నాయి. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌ఫై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా తెర‌కెకుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. దీపికా ప‌దుకొనే మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైన ఈ సినిమాలో మ‌రో టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామ‌స్ మ‌రో కీ రోల్లో క‌నిపించ‌నుంద‌న్న టాక్ వ‌చ్చింది. ఇప్పుడు ఈ వార్త ఇలా ఉండ‌గానే మ‌రో కొత్త రూమ‌ర్ కూడా వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం ఓ హాట్ హీరోయిన్‌ను ఎంపిక చేశార‌ట‌.

రామ్ ఇస్మార్ట్ శంక‌ర్‌లో హాట్ హాట్‌గా ర‌చ్చ చేయ‌డంతో పాటు అఖిల్ ప‌క్క‌న మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో న‌టించిన నిధి అగ‌ర్వాల్ పేరు ఈ సాంగ్ కోసం ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో నాగ్ అశ్విన్ స్వ‌యంగా క్లారిటీ ఇస్తాడ‌ని అంటున్నారు. ఏదేమైనా నిధికి ఈ క్రేజీ ఫిల్మ్‌లో ఛాన్స్ అంటే ఆమె న‌క్క తోక తొక్కిందే అనుకోవాలి. ఇక 2022 స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news