టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్నాడు. ఎన్టీఆర్ అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా చేస్తూ దుమ్ము రేపుతున్నాడు. చిన్నప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో ఎన్టీఆర్ బాలరాముడు పాత్రలో మెప్పించాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ చదువులో పడిపోయిన 2001లో వీఆర్. ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన నిన్నుచూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఎన్టీఆర్ పూర్తిస్థాయి హీరో కాకముందే ఓ బుల్లితెర టీవీ సీరియల్లో నటించాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు.
భక్త మార్కండేయ సీరియల్లో ఎన్టీఆర్ భక్త మార్కండేయుని పాత్రలో నటించాడు. ఈ సీరియల్ అప్పట్లో ఈటీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ తర్వాత ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో హీరోగా తన సత్తా ఏమిటో చూపించాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఇండస్ట్రీలోని క్రేజీ హీరోలలో ఒకడిగా మారిపోవడంతో పాటు బుల్లితెర అయినా వెండితెర అయినా రారాజుగా ఉన్నాడు.