Politicsరాజధాని అమరవాతే... కేంద్రం ఇచ్చే ఆ ట్విస్ట్ ఆయ‌న‌కు ముందే తెలిసిందా...!

రాజధాని అమరవాతే… కేంద్రం ఇచ్చే ఆ ట్విస్ట్ ఆయ‌న‌కు ముందే తెలిసిందా…!

అధికార వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు అదే పార్టీకి పెద్ద తలనొప్పిలా మారిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేస్తున్నారు. అసలు గ్యాప్ లేకుండా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటుపై కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ…వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు.

 

తాజాగా కూడా అమరావతికి మద్ధతుగా మాట్లాడారు. రాజధానికి అమరవాతే సరైన ప్రాంతమని, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే చెల్లుతుందని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు చెల్లవని, అమరావతే రాజధానిగా ఉంటుందని, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఏదీ సాగదని మాట్లాడారు. అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించిందని, అలాగే భారతదేశ చిత్రపటంలో కూడా పెట్టిందని, కాబట్టి అమరావతిని మార్చడం సాధ్యమయ్యే పని కాదన్నట్లు చెప్పారు.

 

అసలు రాజుగారు చెబుతున్న ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా ఉంటుందన్నట్లు బాగా నమ్మకంతో చెప్పారు. అయితే రాజుగారు ఇంత కాన్ఫిడెన్స్ చెప్పడం వెనుక కారణాలు ఏంటో తెలియడం లేదు. ఒకవైపు బీజేపీ నేతలు రాజధాని వ్యవహారంలో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పేశారు. మరి అలాంటిది ఎంపీ మాత్రం అమరావతి రాజధానిగా ఉంటుందని ఎలా చెప్పగలుగుతున్నారని విషయం అర్ధం కావడం లేదు. మామూలుగానే రాజుగారికి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక అక్కడే రాజధాని విషయంలో అమ‌రావ‌తే ఉంటుంద‌ని ఆయ‌న‌కు ఏదో బ‌ల‌మైన న‌మ్మ‌కం ఉంద‌నే టాక్ వ‌స్తోంది.

 

పైకి బీజేపీ నేతలు రాజధాని విషయంలో మా పరిధిలో లేదని చెప్పిన, కేంద్రంలో కీలకంగా వ్యవహరించే రామ్ మాధవ్ లాంటి వారు దేశంలో ఏ రాష్ట్రానికైనా మూడు రాజధానులు ఉన్నాయా ? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీని బట్టి చూసుకుంటే కేంద్రంలోని పెద్దలు మూడుకు వ్యతిరేకంగానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రాజుగారు కూడా అమరావతి నుంచి రాజధాని మార‌ద‌ని చెపుతున్నారంటే కేంద్రం కూడా స‌రైన టైంలో రంగంలోకి దిగుతుంద‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news