ఓ వ్యక్తి ఏకంగా 80 ఏళ్లుగా జుట్టు కత్తిరించుకోకుండా ఉంటున్నాడు. తన 12వ యేట నుంచే అతడు అదే జుట్టుతో ఉంటున్నాడు. ఈ విచిత్ర వ్యక్తి వివరాలు చూస్తే వియత్నాంకు చెందిన 92 ఏళ్ల గుయెన్ వాన్ చిన్. అతడు గత 80 ఏళ్లలో ఒక్కసారిగా తన జుట్టు కత్తిరించుకోలేదు. సుమారు ఐదు మీటర్ల పొడవు మేర పెరిగిన జుట్టుతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు. తన మూడో తరగతి చదువుతున్నప్పుడే జుట్టు కత్తిరించుకోకూడదని నిర్ణయించుకున్నాడట.
చిన్ ఇలా చేయడం వెనక బలమైన కారణం ఉందంటున్నారు. నా జట్టు కత్తిరించుకుంటే చనిపోతానని నమ్ముతాను. అందుకే కనీసం ఒక్కసారి కూడా దువ్వెన ఉపయోగించలేదు. ముడివేసి కొప్పులా మార్చి దానిపై ఓ వస్త్రాన్ని చుడతాను. ఎల్లపుడూ పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకుంటానని చిన్ చెప్పాడు. ఇక చిన్నప్పటి నుంచే నా జుట్టు బలంగా, నల్లగా, ఒత్తుగా ఉండేదని.. అప్పుడు చక్కగా దువ్వుకునేవాడిని అని చెప్పాడు.
ఇక జుట్టుకు, అమరత్వానికి మధ్య బలమైన బంధం ఉన్నదని తాను నమ్ముతానని రాయిటర్స్ పత్రికకు చెప్పాడు. ఇక చిన్ కొకొనట్ మత విశ్వాసాన్ని ఆచరిస్తున్నారు. 1963లో స్థాపించిన ఈ మతాచారం దువాపై ప్రస్తుతం వియత్నాంలో నిషేధం ఉంది. ఇక తాను కేవలం కొబ్బరికాయల వల్లే తమ మనుగడ కొనసాగిందని, వాటి కారణంగానే శారీకరంగా దృఢంగా ఉన్నానని ఆయన చెపుతుంటారట.