Gossipsసంచ‌ల‌న ఫొటో లీక్‌: దీపికా.. ర‌ణ‌వీర్‌తో దావూద్ ఇబ్ర‌హీం డిన్న‌ర్‌

సంచ‌ల‌న ఫొటో లీక్‌: దీపికా.. ర‌ణ‌వీర్‌తో దావూద్ ఇబ్ర‌హీం డిన్న‌ర్‌

అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంతో  బాలీవుడ్ స్టార్‌ దీపికా పదుకొణె, ఆమె భర్త, హీరో రణ్‌వీర్ సింగ్‌లు కలిసి ఫొటో దిగ‌డంతో పాటు డిన్న‌ర్ చేశార‌నే వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో కూడా ఇప్పుడు నెట్లో వైర‌ల్ అవుతోంది. ఇది ప్ర‌స్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఫొటోలో దీపిక‌, ర‌ణ‌వీర్‌తో పాటు ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీ  కూడా ఉన్నారు. ఈ ఫొటో 2013లో వ‌చ్చిన గోలియోంకి రాస్‌లీలా సినిమా షూటింగ్ సంద‌ర్భంగా తీసింది అని చెపుతున్నారు.

ఈ ఫొటోలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె వెనక వరసలో సందీప్‌ పక్కన కూర్చున్న వ్యక్తిని దావుద్ ఇబ్రహీంగా గుర్తిస్తూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ ఫొటోను జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనే పేరుతో గ్రూప్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేసి వైర‌ల్ చేస్తున్నారు. దీపిక‌, ర‌ణ‌వీర్‌, సందీప్ త‌మ స్నేహితుల‌తో కలిసి దిగిన ఫొటోలో దావూద్ కూడా ఉన్నాడంటూ క్యాప్ష‌న్ జోడిస్తున్నారు. ఇక ఇదే ఫొటోను సందీప్‌సింగ్ సైతం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

దీంతో ఒక్కసారిగా తీవ్ర క‌ల‌క‌లం రేగింది. అస‌లు ఈ ఫొటో ఎక్క‌డిది ? అని ఆరా తీయ‌గా ఇది వాస్తవం కాదని, ఆ ఫొటోలో దీపికా, రణ్‌వీర్‌, సంజయ్ లీలా భన్సాలీతో ఉన్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం కాదని తేలింది. అంద‌రూ దావూద్ ఇబ్ర‌హీంగా చెపుతోన్న వ్య‌క్తి వాసిక్ ఖాన్‌గా స్పష్టమైంది. వాసిక్ ఖాన్.. బాలీవుడ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. రామ్‌లీలా సినిమాకు కూడా ఆయనే ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. అది ఈ ఫొటో వెన‌క అస‌లు క‌థ‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news