డిటిహెచ్ లోనే సినిమాల రిలీజ్.. కమల్ అప్పుడే చెప్పాడు..!

డైరెక్ట్ టూ హోమ్ అదేనండి డి.టి.హెచ్.. ఇప్పుడు దాదాపు 50 నుండి 60 శాతం వరకు డిటిహెచ్ లను వాడుతున్నారు. ఈ డిటిహెచ్ లలో డైరెక్ట్ గా సినిమాలను రిలీజ్ చేయాలని అన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్. అదేంటి డైరెక్ట్ గా డిటిహెచ్ లో రిలీజ్ చేస్తే ఇక థియేటర్లకు వచ్చి సినిమాలు ఎవరు చూస్తారంటూ సౌత్ సినీ పెద్దలంతా కమల్ ఆలోచనని పక్కన పెట్టేశారు.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇళ్లల్లో ఉంటున్న ప్రేక్షకులకు కొత్త సినిమాలు చూడాలనే కోరిక మొదలైంది. డిటిహెచ్ లో సినిమాలు రిలీజ్ చేస్తే ఇలాంటి టైం లో ఉపయోగపడేది. అయితే అప్పుడు థియేట్రికల్ బిజినెస్ కచ్చితంగా దెబ్బతింటుంది కాబట్టి ఆ లాభాన్ని డిజిటల్ రైట్స్, శాటిలైట్స్ రూపంలో రాబట్టుకోవాలని అంటున్నారు. ఏది ఏమైనా లాక్ డౌన్ వల్ల డిజిటల్ స్త్రీమింగ్స్ పండుగ చేసుకుంటున్నాయి. ఇప్పటికే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ తో పాటుగా కొత్తగా వచ్చిన ఆహా కూడా సూపర్ క్లిక్ అయ్యింది.

లాక్ డౌన్ లో ఉన్న ఈ టైం లో ప్రతి ఒక్కరు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను బాగా వాడేస్తున్నారు. లాంటి టైం వస్తుందని ఊహించే కమల్ అప్పుడు సినిమాలను డైరెక్ట్ గా డిటిహెచ్ లో రిలీజ్ చేయాలని అన్నారు. ఇకమీదట అయినా దీని గురించి ఆలోచిస్తే బెటర్ అని అంటున్నారు.

Leave a comment