అల్లు అర్జున్ పుష్క ఫస్ట్ లుక్.. మాస్ కా బాప్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాకు పుష్ప టైటిల్ ఫిక్స్ చేశారు. రంగస్థలం తర్వాత సుకుమార్, అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ తమ నెక్స్ట్ ప్రాజెక్టులుగా చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్ని మాస్ లుక్ అదిరింది. సినిమా సినిమాకు క్యారక్టర్ వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్న బన్ని పుష్ప గా మాస్ కా బాప్ అనిపించేలా ఉన్నాడు.

ఆర్య, ఆర్య 2 తర్వాత సుక్కుతో బన్ని చేస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగినట్టుగా పుష్ప ఫస్ట్ లుక్ అదరహో అనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుండగా సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తాడని తెలుస్తుంది.

సుకుమార్ హిట్టు కొడితే ఆ రీసౌండ్ ఎలా ఉంటుందో రంగస్థలంతో తెలిసింది. ఇక ఇప్పుడు పుష్పతో తనకు ఎంతో ఇష్టమైన బన్నీ కోసం మరో సంచలనానికి సిద్ధమయ్యాడు సుకుమార్. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మూసి అందిస్తున్నారని తెలిసిందే. ఈ ముగ్గురు చేసే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Leave a comment