ఆఫర్లు లేక అమలా పాల్ అందుకు సిద్దమైందా..!

బాలీవుడ్ ట్రెండ్ మారింది. అక్కడ సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్స్ సైతం వెబ్ సీరీస్ లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఎక్కడైతే ఏముంది మాకు కావాల్సింది రెమ్యునరేషన్.. అది డిమాండ్ మేరకు ఇచ్చి మీరు సినిమానే తీసుకోండి.. వెబ్ సీరీస్ తీసుకోండి అనేలా ఉన్నారు బాలీవుడ్ స్టార్స్. ముఖ్యంగా బాలీవుడ్ లో హీరోయిన్స్ సినిమాలు, వెబ్ సీరీస్ లు అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు.

ఈ కోవలో ముందుగా ప్రస్తావించాల్సిన హీరోయిన్ లస్ట్ స్టోరీ భామ కియరా అద్వానీ.. లస్ట్ స్టోరీస్ తో రచ్చ చేసిన ఈ అమ్మడు ఈమధ్యనే వచ్చిన గిల్టీ వెబ్ సీరీస్ లో కూడా రెచ్చిపోయింది. సినిమాలతో పాటుగా ఈక్వల్ గా వెబ్ సీరీస్ లతో కూడా సత్తా చాటుతుంది కియరా. ఇక ఆమె దారిలోనే మిగతా హీరోయిన్స్ కూడా వెబ్ సీరీస్ లకు సై అంటున్నారు. ఇదిలాఉంటే ఇప్పుడు సౌత్ భామ అమలా పాల్ కు వెబ్ సీరీస్ ఛాన్స్ వచ్చిందట. అదికూడా బాలీవుడ్ వెబ్ సీరీస్ లో అవకాశం దక్కించుకుంది. ఇంతకీ బీ టౌన్ లో వెబ్ సీరీస్ ఛాన్స్ అందుకున్న భామ ఎవరు అంటే అమలా పాల్ అని తెలుస్తుంది.

డైరక్టర్ విజయ్ తో ప్రేమ పెళ్లి రెండేళ్లు గడవకముందే విడిపోయి ఎవరి దారి వారు చూసుకోగా కెరియర్ మళ్ళీ రీ స్టార్ట్ చేసిన అమలా పాల్ ఎలాంటి పాత్రలకైనా సై అంటుంది. ఇక అందులో భాగంగానే మహేష్ భట్, జియో స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న వెబ్ సీరిస్ లో ఛాన్స్ అందుకుందట. మహేష్ భట్ అనగానే ఆ వెబ్ సీరీస్ కంటెంట్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి అలంటి వెబ్ సీరీస్ లో అమలా పాల్ ఎలా రెచ్చిపోతుందో చూడాలి.

Leave a comment