తారక్‌తో విసిగెత్తిన త్రివిక్రమ్.. అందుకే ఆ నిర్ణయం?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌లో యమ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తు్న్న ఈ సినిమాను జనవరి 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. కాగా తారక్‌తో తన నెక్ట్స్ మూవీని డైరెక్ట్ చేయనున్నట్లు త్రివిక్రమ్ గతంలోనే చెప్పాడు. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ తరువాత తరకెక్కించేందుకు ఆయన రెడీ అవుతున్నారు.

కానీ ఆర్ఆర్ఆర్ రిలీజ్‌ ఏకంగా జనవరికి వాయిదా పడటంతో త్రివిక్రమ్ డైలమాలో పడ్డాడు. అటు తారక్ కూడా పలువురు దర్శకుల కథలు వింటున్నాడనే వార్తలు త్రివిక్రమ్‌ను చిర్రెత్తిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ కూడా తారక్‌ కంటే ముందే ఓ మీడియం రేంజ్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. దీనికి సంబంధించిన కథను కూడా త్రివిక్రమ్ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ప్రకటన కూడా చేస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అటు తారక్‌తో సినిమా రెడీ చేసేందుకు ఇంకా సమయం పడుతుండటంతో ఈ సినిమాను అతి త్వరలో తెరకెక్కించి, అంతే త్వరగా రిలీజ్ చేయాలని చూస్తు్న్నాడట. మరి తారక్‌తో విసిగెత్తిన త్రివిక్రమ్, ఎవరితో సినిమా చేస్తాడనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Leave a comment