టాలీవుడ్‌లో మరో విషాదం.. చిరంజీవి తొలి డైరెక్టర్ మృతి

మెగాస్టార్ చిరంజీవిని వెండితెరకు పరిచయం చేసిన చిత్రం ‘పునాదిరాళ్లు’. ఈ సినిమాతో ప్రేక్షకులను చిరంజీవి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత మెగాస్టార్‌గా టాలీవుడ్‌ను చిరంజీవి ఏలిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు రాజ్‌కుమార్ శనివారం ఉదయం మృతి చెందారు.

పునాదిరాళ్లు సినిమా తరువాత ‘మా శ్రీమల్లి’ అనే చిత్రాన్ని మాత్రమే తెరకెక్కించిన రాజ్‌కుమార్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాసను విడిచారు. ఆయన చివరిరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు ఆనారోగ్యంతో చనిపోయాడు. అప్పటినుండి ఆయన ఒంటరిగానే జీవిస్తున్నాడు.

రాజ్‌కుమార్‌ స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. ఆయన మృతదేహాన్ని అక్కడికి తరలించి అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా రాజ్‌కుమార్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.

Leave a comment