చిరు కాదు వెంకీకి ఓటేసిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. అటు యాక్టింగ్‌తో పాటు చరణ్ తన తండ్రి చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

రీసెంట్‌గా చిరు 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ని చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత చిరు 152వ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు చరణ్. కాగా మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ల్యూసిఫర్ చిత్ర రీమేక్ హక్కులను ఇప్పటికే సొంతం చేసుకున్న చరణ్, తాజాగా మరో మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ హక్కులను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో చేయాలని చరణ్ భావిస్తున్నాడు.

కాగా ల్యూసిఫర్ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో చేయాలని చరణ్ ప్రయత్నిస్తున్నాడు. ఇలా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలిసారి చిరంజీవి కాకుండా వేరే హీరోతో సినిమా చేయాలని చరణ్ చూస్తున్నాడు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు ఓకే అవుతుందో తెలియాలంటే ఈ సినిమా పట్టాలెక్కే వరకు ఆగాల్సిందే.

Leave a comment