ఆ హీరో అంటే పడిచస్తోన్న రష్మిక.. ఎవరో తెలుసా?

కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు యంగ్ హీరో నితిన్‌తో కలిసి భీష్మ సినిమాలో నటించింది. ఈ సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక తనకు ఏ హీరోపై క్రష్ ఉందో అని యాంకర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ యాన్సర్‌ను ఇచ్చింది. ఈ కన్నడ బ్యూటీ తమిళ స్టార్ హీరో ఇళయథళపతి విజయ్ అంటే పడిచస్తుందట. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదంటూ ఆమె చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటి నుండి విజయ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చిన ఆమె, ఆయన తీసిన ప్రతి సినిమాను తప్పకుండా చూస్తానంటోంది.

ఇక తమిళంలో రష్మిక మందన కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం త్వరలో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంద. ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి భీష్మ సినిమాతో అమ్మడు ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.