నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ చేసే రోల్ అదేనా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేశాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తురువాత మరో సినిమాను ప్రభాస్ లైన్‌లో పెట్టాడు. కాగా ఈ సినిమాను మహానటి ఫేం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ తాజాగా వచ్చింది. ప్రముఖ బ్యానర్ వైజయంతీ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనుంది.

ఈ సినిమా కథ ఓ సూపర్ హీరో చుట్టూ తిరుగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సూపర్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాతో అంతర్జాతీయ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో మరి ప్రభాస్ ఎలాంటి సూపర్ హీరో పాత్రలో నటిస్తాడా అనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాగా ఈ సినిమాలో అదిరిపోయే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా సినిమా షూటింగ్‌ను ప్రారంభించి, 2021 చివరినాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. మరి అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేక ఎప్పటిలాగానే వాయిదా పడుతుందా అనేది చూడాలి.

Leave a comment