సెన్సార్ పూర్తి చేసుకున్న హిట్

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఆ తరువాత ఫలక్‌నమా దాస్ వంటి పక్కా మాస్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో హిట్ అనే సినిమాతో మనముందుకు వస్తున్నాడు ఈ హీరో.

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తు్న్న ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు ముగించుకుంది. ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సా్ర్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ యాక్టింగ్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

అటు నాని ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తుందో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే. మరి ఈ సినిమాతో విశ్వక్ సాలిడ్ హిట్ అందుకుంటాడా లేక మరోసారి ఫెయిల్ అవుతాడా అనేది చూడాలి.