వర్మను పెళ్లాడాల్సింది అంటోన్న ఫిదా పోరి!

టాలీవుడ్‌లో ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి చేసిన తంతు అందరికీ తెలిసిందే. ఏ టీవీ ఛానల్ పెట్టినా ఆమెతో పాటు పలువురు ఆర్టిస్టులే కనిపించేవారు. వీరిలో ఫిదా చిత్రంలో నటించిన గాయత్రి గుప్తా కూడా ఒకరు. ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలిగా నటించిన గాయత్రి గుప్తా, ఆ సినిమాతో మంచి ఫేంను దక్కించుకుంది. అంతకు ముందే పలు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఫిదా సినిమాతో అమ్మడు మంచి గుర్తింపును సాధించుకుంది.

అయితే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి పలుమార్లు ప్రస్తావించిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలో తనకు పలువురు దర్శకనిర్మాతలు ఛాన్సులు రాకుండా చేశారంటూ మండిపడింది. కానీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాత్రం గాయత్రి గుప్తా ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ చాలా స్పెషల్ అని, ఆయనంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

కాగా ఆయన తనకంటే ముందే పుట్టడంతో ఆయన్ను పెళ్లి చేసుకోలేకపోయానని, లేకుంటే ఆయనను ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాడినంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ కేవలం సినిమాలే కాకుండా పలు వీడియోల్లో కూడా నటించింది. ప్రస్తుతానికి చేతిలో ఆఫర్లు ఏమీ లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ.

Leave a comment