బోయపాటికి డేట్ ఫిక్స్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని రెడీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లో సినిమాను అనౌన్స్ చేసిన బాలయ్య, ఆ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించాడు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. దీంతో ఈ సినిమా షూటంగ్ ఎప్పుడు మొదలవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే బోయపాటికి ఇటీవల మాతృవియోగం కలగడంతో కొంత గ్యాప్ తీసుకుని, ఇప్పుడు చిత్ర షూటింగ్‌కు రెడీ అయ్యాడు. బాలయ్యను రెండు విభిన్నమైన షేడ్స్‌లో చూపించేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మార్చి 2వ తేదీ నుంచి నిర్విరామంగా జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియా, అంజలిలు నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

Leave a comment