శర్వానంద్‌ను చూసి భయపడుతున్న బయ్యర్లు

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. అయితే శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీ ‘జాను’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా ఫెయిల్ కావడంతో చిత్ర నిర్మాతలు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం చిత్రానికి జాను ఎఫెక్ట్ బాగా పడింది. శ్రీకారం చిత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండగా ఇందులో శర్వానంద్ ఓ పల్లెటూరి అబ్బాయిగా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాను ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అంత సత్తా ఉండకపోవచ్చని, ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఈ సినిమాను కొనేందుకు బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారు. దీంతో శ్రీకారం చిత్ర దర్శకనిర్మాతలు ఆందోళనలో పడ్డారు. మరి ఈ సినిమాతో శర్వానంద్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అనే సందేహం అందరిలోనూ మొదలైంది. ఏదేమైనా ఈ సినిమా అతడికి చావోరేవో అనే మాదిరిగా మారింది.