భీష్మ వస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. దుమ్ములేపుతున్న నితిన్

యంగ్ హీరో నితన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు. కాగా ఈ సినిమాలో నితిన్ తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటించడంతో ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్ చాలా ఆసక్తి చూపించారు. ఇక ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్‌తో పాటు మంచి వసూళ్లను సాధించడంతో తొలి వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో రెచ్చిపోయింది. ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.18.89 కోట్ల మేర వసూళ్లు సాధించింది.

నితిన్ కెరీర్‌లో ఫస్ట్ వీకెండ్‌ ముగిసే సరికి హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా భీష్మ నిలిచింది. ఇక ఏరియాలవారీగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 5.93 కోట్లు
సీడెడ్ – 2.24 కోట్లు
నెల్లూరు – 0.48 కోట్లు
కృష్ణా – 0.92 కోట్లు
గుంటూరు – 1.37 కోట్లు
వైజాగ్ – 1.79 కోట్లు
ఈస్ట్ – 1.20 కోట్లు
వెస్ట్ – 0.88 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 14.89 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.50 కోట్లు
ఓవర్సీ్స్ – 2.50 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 18.89 కోట్లు