Gossipsబాలయ్యకు సెట్ అయిన సీనియర్ బ్యూటీ

బాలయ్యకు సెట్ అయిన సీనియర్ బ్యూటీ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించినా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం కూడా గతకొంత కాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా దగ్గర నుండి టాలీవుడ్ స్టార్ బ్యూటీల వరకు అందరి పేర్లు వినిపించినా, నయనతార, అనుష్క వంటి పేర్లు ఈ సినిమాకు దాదాపు ఖరారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ అవేమీ నిజం కాదంటూ చిత్ర యూనిట్ కొట్టి పారేసింది.

ఇక బాలయ్య సరసన అందాల భామ శ్రియా సరన్ అయితే జోడి చూడముచ్చటగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రియాను కన్ఫమ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. గతంలో బాలయ్య సరసన మూడు చిత్రాల్లో నటించిన శ్రియా అయితేనే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయగలదు అంటూ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

అటు శ్రియా కూడా పెళ్లి తరువాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. బాలయ్య లాంటి మాస్ హీరో సరసన నటించే ఛాన్స్ చివరకు ఎవరికి దక్కుతుందో అనే ప్రశ్న మాత్రం అందరిలోనూ ఉంది. ఏదేమైనా బాలయ్య హీరోయిన్ దొరికేదెప్పుడో, సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యేదెప్పుడో అంటూ అభిమానులు అనుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news