పవన్‌ ఫస్ట్ సింగిల్ అదిరిపోవడం ఖాయమట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తు్న్న తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ కొట్టిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు పవన్. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మి్స్తున్న ఈ సినిమా మే నెలలో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో పవన్ ఓ లాయర్‌గా కనిపించునున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ చిత్ర యూనిట్ నుండి రాకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న థమన్ ఈ సినిమాలో తొలి పాట అదిరిపోయే రేంజ్‌లో రానున్నట్లు తెలిపారు. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాకు అదిరిపోయే మ్యూజిక్‌ను అందించిన థమన్, ఇప్పుడు ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి తాజాగా థమన్ ఓ ట్వీట్ చేశాడు. అదిరిపోయే పాటతో మీ ముందుకు త్వరలో రానున్నామని ఆయన తెలిపాడు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నివేదా థామస్ మెయిన్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమాలోని పాటలు ఎలా ఉంటాయో తెలియాలంటే అవి రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

Leave a comment