Moviesవిశ్వక్ సేన్ హిట్ మూవీ రివ్యూ & రేటింగ్

విశ్వక్ సేన్ హిట్ మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా: హిట్
నటీనటులు: విశ్వక్ సేన్, రుహానీ శర్మ, భాను చందర్, బ్రహ్మాజీ తదితరులు
సినిమాటోగ్రఫీ: మణికందన్
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత: నాని, ప్రశాంతి
దర్శకత్వం: శైలేష్ కొలను

ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్, తన నెక్ట్స్ మూవీ ఫలక్‌నుమా దాస్‌తో అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ఇక ఈ హీరోతో మరో హీరో నాని నిర్మాతగా మారి చేసిన కాప్ థ్రిల్లర్ హిట్ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. పూర్తి థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ‘హిట్’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో రివ్యూలో చూద్దాం.

కథ:
విక్రమ్ రుద్రరాజు(విశ్వక్ సేన్) ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా హిట్‌ టీమ్‌లో వర్క్ చేస్తుంటాడు. అతడికి ఓ చేదు గతం ఉండటంతో అన్యాయాలను ఎట్టిపరిస్థితుల్లో ఎదుర్కొనే ఆఫీసర్‌గా పేరుంటుంది. ఇక ఓ అమ్మాయి మిస్సింగ్ కేసులో తన తోటి ఆఫీసర్ నేహా(రుహానీ శర్మ) కూడా మిస్ అవ్వడంతో ఈ కేసును విక్రమ్‌ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి, అతడు వాటిని ఎలా అధిగమించాడు అనేది సినిమా కథ.

విశ్లేషణ:
కాప్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉన్నాయి. కాగా ఈసారి సీరియస్ కాప్ థ్రిల్లర్‌తో మనముందుకు వచ్చిన సినిమా హిట్, ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఈ సినిమా మొదటి నుండి కూడా థ్రిల్లింగ్ అంశాలను చక్కగా చూపిస్తూ, చివరి వరకు అదే ఆతృతను మెయింటెయిన్ చేయడంలో విజయం సాధించింది. ఆసక్తికరమైన కథకు ఆకట్టుకునే కథనం తోడవ్వడంతో ఈ సినిమా జనాలను మెప్పించింది.

ఇక కథనం విషయానికి వస్తే, ఫస్టాఫ్ నుండి చివరి వరకు కూడా థ్రిల్లర్ ఎలిమెంట్స్, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నేలా ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నాప్ కేసును చేధించే క్రమంలో వచ్చే అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ఈ సినిమా కాస్త బోరింగ్ ఫీల్‌ను కలిగించినా, థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉండటంతో జనాలు బోర్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.

అటు ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో వచ్చే ట్విస్టులు సూపర్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇక చిత్ర యూనిట్ ఈ సినిమాపై మొదటి నుండి పెట్టుకున్న నమ్మకాన్ని వారు పూర్తిగా నిలబెట్టుకున్నారని చెప్పాలి. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందనే ధీమాతో నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నటీనటుల పర్ఫార్మె్న్స్:
విక్రమ్‌గా విశ్వక్ సేన్ నటన ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాను అతడు తన నటనతో లాక్కొచ్చాడు. యాక్షన్‌, డైలాగ్ ఫిక్షన్‌తో విశ్వక్ ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో మనకు కేవలం విశ్వక్ సేన్ మాత్రమే కనిపిస్తాడు, బ్రహ్మాజీ, భాను చందర్, మురళీ శర్మ, రుహానీ శర్మ తమ నటనతో ఆకట్టుకున్నారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఈ సినిమాను పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దిన డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకు అదిరిపోయే స్క్రీన్‌ప్లేను అందించి మెప్పించాడు. ఇక ఈ సినిమా కథనం కూడా ప్రేక్షకులను కట్టిపడేశాలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ఖచ్చితంగా ముగ్ధులవుతారు. అటు సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉండటం, వివేక్ సాగర్ సంగీతం ఆకట్టుకోవడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు సీట్లకే పరిమితమయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
హిట్ – విశ్వక్‌తో హిట్ కొట్టిన నాని!

రేటింగ్:
3.0/5.0

Latest news