వెంకీ మామ 21 డేస్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. బొమ్మ హిట్టు

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మూవీ వెంకీ మామ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ సినిమాలోని ఎమోషన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమాకు రిలీజ్ రోజునే హిట్ టాక్ వచ్చింది.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా దుమ్ములేపింది. ఇప్పటికే ఈ సినిమా లాభాల్లోకి చేరిన సంగతి అందిరకీ తెలిసిందే. 32 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 21 రోజులు ముగిసే సరికి రూ.37 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేశారు.

ఇక ఏరియాలవారీగా ఈ సినిమా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 21 డేస్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 12.18
సీడెడ్ – 4.78
ఉత్తరాంధ్ర – 5.24
ఈస్ట్ – 2.36
వెస్ట్ – 1.44
కృష్ణా – 1.88
గుంటూరు – 2.33
నెల్లూరు – 1.02
టోటల్ ఏపీ+తెలంగాణ – 31.23 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.68
ఓవర్సీస్ – 3.24
టోటల్ వరల్డ్‌వైడ్ – 37.15 కోట్లు

Leave a comment