మహేష్‌తో చిన్న సినిమాల డైరెక్టర్.. వర్కవుట్ అయ్యేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచానలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

అయితే ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని మహర్షి లాంటి సూపర్ హిట్ అందించిన వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే తన 28వ చిత్రాన్ని మాత్రం మహేష్ ఓ చిన్న సినిమాల దర్శకుడిత తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

భలే భలే మగాడివోయ్ చిత్రం సక్సెస్‌తో మారుతి ఇండస్ట్రీలో మంచి సినిమాలను తెరకెక్కించగలడనే గుర్తింపు పొందాడు. ఈ సినిమా సక్సె్స్‌తో వెంటనే మహేష్ దర్శకుడు మారుతిని పిలిచి అడ్వాన్స్ చెక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రతిరోజూ పండగే సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్న మారుతితో మహేష్ 28వ చిత్రం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం మహేష్ నోటి నుండి ఈ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే అంటున్నారు అభిమానులు. అయితే మహేష్ స్థాయి స్టార్ హీరోలతో మారుతి సినిమాలు చేయలేదు. మరి మహేష్‌కు మారుతితో సినిమా అంటే రిస్క్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ కథ ఏ కంచికి చేరుతుందో చూడాలి.

Leave a comment