రజినీకాంత్ దర్బార్ సెన్సార్ టాక్.. రన్‌టైంతో చితక్కొట్టడం ఖాయం

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్ సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రజినీకాంత్ తన సత్తా చాటడం ఖాయమని అంటున్నారు తలైవా ఫ్యాన్స్. ఇక ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని, రజినీకాంత్ మరోసారి రెచ్చిపోయి నటించారని అన్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. పోలీస్ పాత్రలో రజినీ యాక్టింగ్‌కు థియేటర్ల టాప్ లేవడం ఖాయమని సెన్సార్ సభ్యులు కితాబిచ్చారు.

అటు ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో రజినీ పర్ఫార్మెన్స్‌కు వారంతా షాకైనట్లు తెలుస్తోంది. ఇక నయనతార కూడా ఈ సినిమాలో బాగా నటించిందని, మురుగదాస్ డైరెక్షన్ సూపర్‌గా ఉందని వారు తెలిపినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. కాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 39 నిమిషాలకు ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించారు. జనవరి 9న రిలీజ్ కానున్న దర్బార్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment