జాను టీజర్ టాక్.. ఎక్కడ వదిలేశాడో అక్కడే ఉన్నాడు!

తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 96 తెలుగు రీమేక్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ రీమేక్ సినిమాతో 96 లాంటి సూపర్ సక్సెస్‌ను అందుకోవాలని దిల్ రాజు చూస్తున్నాడు. కాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

యంగ్ హీరో శర్వానంద్, అక్కినేని సమంత నటిస్తోన్న ఈ సినిమాకు జాను అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టారు. కాగా తాజాగా జాను టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తే ప్రేమ, దానిలో ఉండే మాధుర్యం, అది కోల్పోతే కలిగే నొప్పి అన్నీ చూపించారు చిత్ర దర్శకుడు. 96 సినిమాను చూసిన వారికి జాను టీజర్ కొత్తగా ఏం అనిపించదు. కానీ ఆ సినిమాను చూడని తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఓ సరికొత్త అనుభూతి మిగిల్చే సినిమాగా జాను నిలుస్తుంది.

స్కూల్ లైఫ్‌లో మొదలైన ప్రేమను కోల్పోయిన హీరో తిరిగి తన ప్రేయసిన చాలా సంవత్సరాల తరువాత కలిస్తే, అతడి పరిస్థితి ఏమిటనేది సినిమా కథ. ఈ సినిమాలో సమంత లుక్ చాలా బాగుంది. ఇక శర్వానంద్ కూడా ఈ సినిమా కోసం తనను తాను మేకోవర్ చేసుకున్నాడు. తమిళంలో 96 చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment