క్రేజ్‌లోనూ సరిలేరు నీకెవ్వరు మహేషా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ. అంతలా క్రేజ్‌ను క్రియేట్ చేశాడు మహేష్. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో మహేష్ ఇండస్ట్రీ రికార్డులకు ఎసరు పెట్టారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో మహేష్ ఎలాంటి సునామీ సృష్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా సరిలేరు నీకెవ్వరు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే సంక్రాంతి బరిలో ఈ ఒక్కసినిమానే రిలీజ్ అవుతుందా అనే రేంజ్‌లో మహేష్ సినిమా కోసం జనం ఎగబడుతున్నారు. మహేష్ ఇప్పటివరకు చేయని కథతో ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ మొదటి నుండి చెబుతూ వస్తుండటంతో ఈ సినిమాలో అంతగా ఏముందో తెలుసుకోవాలనే ఆతృత అందరిలోనూ మొదలయ్యింది.

ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న మహేష్, రాయలసీమలో ఏం చేస్తాడనే అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాలో 30 నిమిషాల ట్రెయిన్ సీక్వెన్స్‌ జనాలకు కడుపుబ్బా నవ్వించడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. దీంతో పాటు విజయశాంతితో మహేష్ సీన్స్ చాలా బాగుంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను ఫస్ట్ డే రోజునే చూడాలని జనాలు తహతహలాడుతున్నారు.

Leave a comment