చిరు 152లో మెగా ట్రీట్.. లేక డబుల్ ట్రీట్..?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సైరా నరసింహా రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసిన మెగాస్టార్ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే చిరు 152వ చిత్ర షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటినుంచో ఓ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అంటూ కొట్టిపారేశారు సినీ జనం.

కాగా ఈ సినిమాలో చరణ్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. రామ్ చరణ్ కోసం కొరటాల శివ ఓ పవర్ ఫుల్ పాత్ర రాసినట్లు, నటించేందుకు రామ్ చరణ్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చిరు 152వ చిత్రంతో మెగా ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్‌తో పాటు డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.