బాలయ్య నాకేమీ చేయలేదంటున్న ఎన్టీఆర్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్ పాత్రలో నటించిన పి.విజయ్ కుమార్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఆయన ఎవరనే విషయం చాలా మందికి తెలియదు. కాగా రెండు రోజులుగా ఆయన భార్యకు క్యాన్సర్ సోకిందని, ఈ విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ ఆవిడ ట్రీట్‌మెంట్‌ను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగా చేయించేలా చర్యలు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే వీటిపై సదరు నటుడు పి.విజయ్ కుమార్ స్పందించాడు. తన భార్యకు క్యాన్సర్ సోకిందనే వార్త వస్తవమని, అయితే ఆమెకు సర్జరీ వేరే ఆసుపత్రిలో చేయించానంటు చెప్పాడు విజయ్ కుమార్. కాగా బసవతారకం ఆసుపత్రిలో కెమోథెరఫీ బాగా చేస్తారనే విషయం తెలుసుకుని ఆమెను ప్రస్తుతం అందులో చేర్పించానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాలేమీ బాలయ్యకు తెలియవని, ఆయనకు తెలిసుంటే ఖచ్చితంగా సాయం చేస్తారని విజయ్ కుమార్ చెప్పారు.

మొత్తానికి బాలయ్యపై అభిమానంతో సోషల్ మీడియాలో ఆయన్ను పొగడ్తలతో ఆకాశానికెత్తిన వారందరి చెంప చెళ్లుమనిపించేలా సమాధానం ఇచ్చాడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని ఎన్టీఆర్. మరి ఈ విషయంపై బాలయ్య ఏమైనా స్పందిస్తాడా అనేది చూడాలి.

Leave a comment