నిమిషం పాటు ముద్దు సీన్‌.. రెండు రోజుల ప్రాక్టీస్

బాలీవుడ్‌ సినిమాల్లో ముద్దు సీన్లకు కొదువే ఉండదు. అక్కడి జనాలు మూతులు నాకుతుంటే చొంగకార్చే వారు దేశవ్యాప్తంగా ఉన్నారు. ముద్దు సీన్లలోనూ వెరైటీ ప్రయత్నాలు చేయడంలో బాలీవుడ్ జనాలు సిద్ధహస్తులు. తాజాగా ఓ సినిమాలోని ముద్దు సీన్లే దీనికి ఉదాహరణ. బాలీవుడ్‌లో తెరకెక్కిన మలంగ్ అనే సినిమాలో ఏకంగా నిమిషం పాటు ఓ ముద్దు సీన్ ఉందట.

ఈ ముద్దు సీన్ అలాంటి ఇలాంటి ముద్దు సీన్ కాదండోయ్. అండర్ వాటర్‌లో హీరోహీరోయిన్లు ఏకంగా నిమిషం పాటు ముద్దు పెట్టుకోనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల అండర్ వాటర్ ముద్దు సీన్ కోసం వారికి రెండు రోజుల పాటు ట్రెయినింగ్ కూడా ఇచ్చారట.

వారి లంగ్ కెపాసిటీ పెరిగేందుకే ఈ అండర్ వాటర్ ట్రెయినింగ్ ఇచ్చామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో నిమిషం పాటు ఉండే అండర్ వాటర్ ముద్దు సీనే హైలైట్ కానుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రిలీజ్‌కు ముందే ఇంత రచ్చ చేస్తున్న ఈ కిస్సింగ్ సీన్ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment