ప్రతిరోజూ పండగే రెండు వారాల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ప్రతిరోజూ పండగే రిలీజ్ అయ్యి అపుడే రెండు వారాలు దాటింది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో మెగా ఫ్యాన్స్‌తో పాటు చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాతో తేజు అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

సక్సెస్ కోసం తహతహలాడిన తేజు, ప్రతిరోజూ పండగే సినిమా రిజల్ట్‌తో పండగ చేసుకుంటున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. తేజు కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు ఈ సినిమా సాధించడంతో చిత్ర యూనిట్ కూడా సంతోషంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ లేకపోవడం, పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.

రెండు వారాలు ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.30.33 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్, రావు రమేష్‌ల యాక్టింగ్ సినిమాకు ప్లస్ కాగా ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా రెండు వారాల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – రెండు వారాల కలెక్షన్స్
నైజాం – 10.81 కోట్లు
సీడెడ్ – 3.46 కోట్లు
నెల్లూరు – 0.80 కోట్లు
కృష్ణా – 1.82 కోట్లు
గుంటూరు – 1.72 కోట్లు
వైజాగ్ – 4.05 కోట్లు
ఈస్ట్ – 1.80 కోట్లు
వెస్ట్ – 1.37 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 25.83 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.00 కోట్లు
ఓవర్సీస్ – 2.50 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 30.33 కోట్లు

Leave a comment