అల వైకుంఠపురములో సెన్సార్ రిపోర్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా పాటలతో పాటు టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు వారు అల వైకుంఠపురములో సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉందని వారు చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని వారు అన్నారు. ఈ సినిమాలోని కంటెంట్ సాధారణ ప్రేక్షకులను రంజింపచేసే విధంగా ఉందని వారు తెలిపారు. త్రివిక్రమ్ నుండి ఎలాంటి సినిమా కోరుకుంటారో అదే ఇందులో ఉందని వారు తెలిపారు.

ఇక బన్నీ యాక్టింగ్ సూపర్‌గా ఉందని వారు కితాబిచ్చారు. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.

Leave a comment