బాలయ్య కోసం బోయపాటి తిప్పలు

నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ రూలర్ బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసిన విషయం తెలిసిందే. పాత చింతకాయ పచ్చడి లాంటి కథతో బాక్సాఫీస్ వద్ద సందడి చేద్దామనుకున్న బాలయ్య సినిమాను ఆడియెన్స్ తిప్పికొట్టారు. ఈ సినిమా ఫెయిల్యూర్‌ కావడంతో తన నెక్ట్స్ మూవీ ఎలాగైనా హిట్ కావాలనే కసితో బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య తన నెక్ట్స్ మూవీని ప్రారంభించాడు.

అయితే బాలయ్యను మరోసారి మాస్ యాంగిల్‌లో చూపించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకోవాలని బోయపాటి ఓ కథను సిద్ధం చేశాడు. అయితే ఆ కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా బాలయ్య సూచించాడట. దీంతో బోయపాటి మళ్లీ ఆ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా, మాస్ ఎలివేషన్స్ పుష్కలంగా ఉండే విధంగా బోయపాటి ఈ కథను సిద్ధం చేయాల్సిందిగా బాలయ్య ఆర్డర్ వేశాడట. మరి బాలయ్య కోసం బోయపాటి తిప్పలు ఇంకెంత కాలం ఉంటాయో చూడాలి. ఏదేమైనా సక్సెస్ మాత్రం వీరిద్దరికీ కావాల్సిందే.

Leave a comment