సరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్.. అదిరింది భయ్యా!

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ భారీ అంచనాలను క్రియేట్ చేసుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

సరిలేరు నీకెవ్వరు సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. మహేష్ బాబుకు ఎందుకంత క్రేజ్ ఉందో ఈ సినిమా చూస్తే మరోసారి తెలుస్తోందని సన్సార్ సభ్యులు తెలిపారట. ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌ తమకు చాలా బాగా నచ్చిందని, దర్శకుడు ఈ సినిమాను ప్రేక్షకుల అభిరుచి మేరకు చాలా చక్కగా తెరకెక్కించాడంటూ వారు పొగిడారట. ఇక మహేష్ యాక్టింగ్ ఈ సినిమాలో మరో లెవెల్‌లో ఉందని వారు కితాబిచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పైగా ఈ సినిమాను సంక్రాంతి లాంటి పండగ సీజన్‌లో రిలీజ్ చేయడంతో సినిమా కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Leave a comment