చిరు సినిమాలో లేడీ సూపర్ స్టార్.. ఎవర్‌గ్రీన్ కాంబినేషన్‌కు రెడీ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఇటీవల సైరా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన మెగా బాస్, ఇప్పుడు 152వ చిత్రంతోనూ అదే రిపీట్ చేయాలని చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.

దర్శకుడు కొరటాల శివ రాసుకున్న సబ్జెక్టులో చిరుతో పాటు అంతే ప్రాముఖ్యం గల ఓ లేడీ పాత్ర ఉంది. ఈ పాత్రలో నటించేందుకు లేడీ అమితాబ్ విజయశాంతిని అడిగారట చిత్ర యూనిట్. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. అయితే గతంలో చిరు-విజయశాంతి జంట అంట ప్రేక్షకులకు కన్నులపండుగ అని చెప్పాలి.

వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించాయి. కానీ కొన్ని కారణాల వల్ల వారు మళ్లీ కలిసిన దాఖలాలు లేవు. దీంతో ఇప్పుడు ఈ కాంబో తెరపై కనిపిస్తే చూడాలని మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా కోరుతున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకున్నారు. దీంతో ఒకేవేదికపై చిరు, విజయశాంతిలను చూసే అవకాశం ఉందని, వారిని త్వరలోనే వెండితెరపై కూడా చూడాలని కోరుతున్నారు అభిమానులు. మరి ఇది సాధ్యమవుతుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.