సూపర్ సక్సెస్ సీక్వెల్‌ సీక్రెట్ చెప్పిన వెంకీ మామ

విక్టరీ వెంకటేష్‌కు 2019 బాగా కలిసొచ్చిందని చెప్పాలి. 2019 మొదట్లో సంక్రాంతికి ఎఫ్2 అనే సినిమాను రిలీజ్ చేసి సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు వెంకీ. ఆ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాలో వెంకీ కామెడీకి ప్రేక్షకులు పూర్తి మార్కులు వేయడంతో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక అదే ఏడాది చివర్లో వెంకీ మామ అనే సినిమాతో వచ్చి మరో సక్సె్స్ కొట్టాడు వెంకీ.

నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలో నటించిన వెంకటేష్ ఈ సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాక 2019 సంవత్సరాన్ని సక్సెస్‌తో ముగించాడు వెంకీ. అయితే ఎఫ్2 సినిమాలో వెంకీ కామెడీతో దుమ్ములేపడంతో ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఆ తరువాత సీక్వెల్ మూవీ గురించి చిత్ర యూనిట్ తరువాత ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు.

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ ఎఫ్2 సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తిగల విషయాలు తెలిపారు. ఎఫ్2 సీక్వెల్ సినిమా ఖచ్చితంగా ఉంటుందని, ఆ సినిమాలో కూడా వెంకీతో పాటు వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్లను సెలెక్ట్ చేయాల్సి ఉందని తెలిపాడు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్‌ను కూడా రెడీ చేస్తున్నట్లు వెంకీ తెలిపాడు. కాగా వెంకటేష్ ప్రస్తుతం అసురన్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు.

Leave a comment