జాను కోసం ఎడారిలో వెతుకుతున్న శర్వా

యంగ్ హీరో శర్వానందర్, స్టార్ బ్యూటీ సమంత కలిసి నటిస్తున్న సినిమా ‘జాను’. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 మూవీకి ఈ సినిమా తెలుగు రీమేక్ అని అందరికీ తెలిసిందే. ఈ సినిమా అక్కడ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాతో మరోసారి అదే ఫీల్‌ను తెలుగు ఆడియెన్స్‌కు కలిగించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్‌ను తాజాగా చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఏడారిలో ఒంటెల గుంపుతో నడుస్తూ శర్వానంద్ అన్వేషణ చేస్తున్న ఫోటోను ఫస్ట్ లక్ పోస్టర్‌గా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో సమంత ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలియాలంటే మాత్ర సినిమా యూనిట్ అనౌన్స్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తమిళంలో విజయ్ సేథుపతి, త్రిష నటించిన ఈ సినిమా అక్కడి జనాలను ప్రేమ మత్తులో ఊరేగించింది. ఈ సినిమా తమిళంలో సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు తెలుగు రీమేక్‌లో సూపర్ సక్సెస్ కావడం కూడా ఖాయమని అంటున్నారు చిత్ర వర్గాలు.

Leave a comment