అల వైకుంఠపురములో రన్‌టైమ్.. టెన్షన్‌ పడుతున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. మాటల మాంత్రికుడు త్రవిక్రమ్ డైరెక్షన్‌లో మూడోసారి బన్నీ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియెన్స్. అయితే ఓ విషయం మాత్రం చిత్ర యూనిట్‌ను కాస్త ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.

సెన్సార్ బోర్డు ఈ సినిమాను యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 165 నిమిషాలకు ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఇంత పెద్ద రన్‌టైమ్‌తో ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కాస్త కష్టమే అంటున్నారు సినీ క్రిటిక్స్. కంటెంట్‌లో దమ్ము ఉంటేనే ప్రేక్షకులు ఓపికగా ఈ సినిమా పూర్తయ్యే వరకు చూస్తారు. అంతేగాని ఏదైనా తేడా కొడితే మాత్రం సినిమా రిలీజ్ తరువాత మళ్లీ కత్తెరేయించుకోవడం తప్పదని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

అయితే అల వైకుంఠపురములో చిత్ర యూనిట్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ సినిమా పండగ సీజన్‌లో రిలీజ్ అవుతుండటంతో ఎక్కువ రన్‌టైమ్ ఉన్న ఆడియెన్స్ ఆదరిస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఎలాంటి మాయ చేసాడో తెలియాలంటే మాత్రం జనవరి 12 వరకు ఆగాల్సిందే.

Leave a comment