నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం ఎంత మంచివాడవురా సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్కు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వారు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ అనుబంధాల నేపధ్యంలో సాగే ఈ సినిమా రన్టైంను 2 గంటల 22 నిమిషాలక ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. సాధారణంగా ఈ రన్టైమ్ సినిమాలకు చాలా మంచిదని చెప్పాలి. రెండున్నర గంటలలోపు ఉండే సినిమాలను పూర్తిగా ఆస్వాదించే ఆస్కారం ఉంటుందన సినీ జనం అంటున్నారు. ఇక సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా, తమ కథపై తమకు ఉన్న నమ్మకంతో ఈ సినిమాను పండగ సీజన్లోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ధైర్యం చేసింది.
గతంలో కూడా ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి రెండు పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయిన శతమానం భవిత ఎలాంటి ఘనవిజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు కూడా అదే ఫీట్ రిపీట్ కావడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు ఎలాగూ నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ ఉండటంతో ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతి బరిలో విజయం సాధిస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేస్తుండగా జనవరి 15న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.